Devotee: Laxmoji Ventrapragada

Date: 15-Apr-2023

Om SaiRam 💐🙏...

Om SaiRam 💐🙏
Today(Saturday, April 15, 2023), we had wonderful
Fortune to have Lord Hanuman Darshanamu in San Jose through beloved Sai Bhandu Sri Rayapati Swamy.
We just about to start from home, we got Vudhi and prasadam and blessings Sairama Chandra Murthy from Shirdi Sansthan by post. Very very happy and also surprised that on the cover both Sai baba and Sri Rama Chandra Prabhu present. 
5 Feet tall Hanuman ji idol (stone) was made of holy and powerful Salagram in Nepal Gandaki River by Mataji Karunamai. Originally kept 7 years in Atlanta and moved to California. Prana Prasthistha also done and due to some reasons , it was kept in wooden box again. 
Very very painful to see prathista Swamy in the wooden box lying in open space infront of temple topless impacted by all seasons. Very hard to open and hold the doors of wooden box.
Offered flowers 🌺, nevedyam, Viswa sai temple plan, and prayers to Prabhu. Invited lord to stay in Viswa Sai Ashram.
Swamy is so vibrant, beautiful and very very powerful. 
We closed the box and discussing about Swamy’s grace and possibility of taking Swamy to Ashram if the owner permit. Suddenly one old man came from temple and opened it again voluntarily   to have Hanumanji darshan. That is also a big surprise and lord blessed us again. 
Planning to have same Salagram Anjaneya Swamy with Panchamukha swaroop.
Shared pictures to have Lord Hanumanji Blessings to all Viswa Sairam families.💐🙏
Pranamamas 💐🙏
SaiRam Ho Hamara Malik
Jai Hanuman .

Devotee: Ramana

Date: 06-Mar-2023

Koti Sai Gayatri Maha Mantra chanting and Annadanam 2021 in Hindi. We are praying Saibaba to wipe...

Koti Sai Gayatri Maha Mantra chanting and Annadanam 2021 in Hindi. We are praying Saibaba to wipe-out the Covid-19 pandemic. Please join and have Baba's blessings. In this video, our beloved Sri Sai Upasak Guruji Sri Laxmoji explains about Sai Gayathri Maha Mantra's importance and benefits. Mantra count updates, how to feed the hungry, and the.

Devotee: Madhavi , Orissa

Date: 02-Jan-2021

సాయిరాం..గురువుగారు..ఈ సంవత్సరం 1స్ట్...

సాయిరాం..గురువుగారు..ఈ సంవత్సరం 1స్ట్ రోజే బాబా ఒక లీల చేశారు..
   ఏమిటి అంటే,నా దగ్గర ఉన్న బాబా చిన్న విగ్రహం సంబల్పూర్ లో ఒక devoti కి చాలా నచ్చింది.నన్ను రోజు అడిగేది,"నాకు ఈ బాబా కావాలి"..అని..మంచి భక్తురాలు.saigayatree చాలా చేస్తుంది..
  నేను ఒకరోజు" సరే,అయితే నాకు నాకు షిర్డీ నుంచి కొత్త విగ్రహం వచ్చేవరకు ఇవ్వను,వచ్చాక ఇస్తాను" అన్నాను.
  మొన్న bbsr నుంచి ఒక ఫామిలీ షిర్డీ వెళ్లారు.వాళ్ళు సాయి గాయత్రీ చేస్తారు.వాళ్లకు నేను చెప్పాను,నా కోసం కొత్త విగ్రహం చూసి,తెస్తారా? అని..వాళ్ళు ట్ర్య్ చేస్తాము..అన్నారు..1st బాబా దర్శనం తరువాత వాళ్ళు ఒక షాప్ కు వెళ్లారు.ఆ షాప్ వాడు,మీకోసం ఒక బాబా విగ్రహం మేము పెట్టాము..తీసుకోండి..అన్నారట..వీళ్ళు ఆశ్చర్య పోయినారు.చూస్తే ఆ మూర్తి చాలా బాగుంది..అది నా కోసం తెచ్చారు.మళ్ళీ వెంటనే వాళ్లకు సంస్థానం నుంచి ఫోన్ వచ్చింది.ఏమంటే" మీ కోసం మేము ఒక విగ్రహం పెట్టాము,వచ్చి తీసుకెళ్లండి" అని..వీళ్ళు మళ్ళీ ఆశ్చర్య పోయినారు..ఆ ఈచినవాళ్ళు సంస్థానం లో 50 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారంటే.కలలో బాబా కనపడి,ఈ విగ్రహం వాళ్లకు ఇవ్వు,నేను అక్కడికి వెళ్తాను" అన్నారట.
  ఎంతలీల చూడండి..నాది సంబల్పూర్ ఆవిడకు ఇష్టం..అక్కడికి వెళ్తారు..నాకు కొత్తది,మంచిది వచ్చింది..అది సంకష్టచతుర్తి. రోజు..తెచ్చిన వాళ్లకు బాబా స్వయం వచ్చారు..అందుకే బాబా లీలలు వర్ణించనాలవి కాకుండా ఉన్నాయి.అలా నిన్న మా ఇంట్లో అడుగుపెట్టిన బాబా వారి విగ్రహం..ఇదే..

Devotee: Praveena K

Date: 10-Dec-2020

నమస్తే గురూజీ, ముందుగా బాబా కి ధన్యవ...

నమస్తే గురూజీ, ముందుగా బాబా కి ధన్యవాదాలు చెప్పాలి. శ్రీదేవి ని ఫ్రెండ్ గా ఇచ్చినందుకు,మిమ్మల్ని మాకు గురువుగా ఇచ్చినందుకు. మార్నింగ్ శ్రీదేవి తో మాట్లాడాను. ఎంత happy గా ఉన్నానో చెప్పలేకుండా వున్నాను. బాబా ఇంత ఫాస్ట్ గా results చూపిస్తారు అనుకోలేదు.4 weeks back బాబాకి చెప్పుకున్నాను ,every year ఇల్లు మారే ఓపిక లేదు బాబా,ఒక place లో settle చెయ్యండి, ఈ ఒక్కసారి కి shift అవ్వడానికి కనీసం strength ఇవ్వండి బాబా అని ఏడ్చేశాను. ఎప్పుడో ఎందుకే పిచ్చిమోహమా ఇప్పడు ఉన్న ఇంట్లోనే settle చేస్తాను అని మీ ద్వారా చెప్పారు.. ప్రయత్నం చెయ్యండి అని మీరు చెప్పిన మూడు రోజులకే అంతా miracle లాగా జరిగిపోయింది. నిన్న owners తో మాట్లాడాము, 3 months టైం హౌస్ తీసుకుంటాం అని చెప్పాము, సరే అన్నారు. ధన్యవాదాలు గురూజీ మీకు.🙏🙏 ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మీ రూపం లో బాబా వున్నారు మాకు అనే ఆలోచన తలుచుకుంటేనే చాలా ప్రశాంతం గా ఉంది మనసుకు. విశ్వాసాయి గ్రూప్ లో member ని అవ్వినందుకు ధన్యురాలిని.. జై సాయి రాం🙏🙏💐💐

సాయిరాం Praveena తల్లి,
మీ పుణ్య దంపతులకు  , మీ కుటుంబానికి  శ్రీ సాయి భగవానుల ఆశీర్వచనములమ్మ .
ఎంతో  చక్కని సాయి లీల , ఎంతో ఆనందదాయకము. అమెరికా లో కేవలము  మూడు రోజులలో అప్రయత్నముగా (ధనము తో సిద్దముగ  లేకుండానే )
సొంత ఇల్లు ప్రసాదము బాబా లీలా వినోదము. చిత్రము మరియు వారి కృప అపారము. 
ఈ మధ్యనే , మరియొక పుణ్య దంపతులకు సొంత ఇంటికలను నిజము చేసినారు. పోటీలో వేరే వాళ్లకు వెళ్ళిన కూడా  మీకే  వస్తుంది అని చెప్పి మనవాళ్లకు  వచ్చేలా చేసినారమ్మ.
మీ పుణ్యదంపతుల ప్రేమ , భక్తి , సర్వ జీవులపట్ల మంచితనము , అలుపెరుగని  దాన ధర్మములు , గురువు పట్ల మీకున్న అంకిత భావము , మీ అర్హతతో కూడిన వేడికోలు , బాబా అనుగ్రహమునకు పాత్రమైనవ్వి  అమ్మ.
మీకు , మీ బంగారు బిడ్డలకు శుభము , జయము , మంగళము అగుగాక . మీకు స్థిరత్వమూ, శాంతి లభించుగాక.  అది బాబా నివాస గృహము.
భక్తులు బాబాను , గురువును నమ్మును. గురువు బాబా ను , శిష్యులను నమ్మును.
బాబా గురు శిష్యుల ఇద్దరిలోను నివసించును.
ర్వము సాయివాణి బాబార్పణమస్తు.
మీ కుటుంబము మాకు బాబా ప్రసాదము .
ప్రణామములు .🙏💐
విశ్వ సాయి ద్వారకామాయి కీ జై .🙏💐
సాయి గాయత్రి  మాతాకీ  జై .🙏

Devotee: Prasad

Date: 30-Nov--0001

Maha Mantra H...

Maha Mantra Hymns; Holy Chants Archana (honor, adore, offer, prayer). It is a ritual performed to request a pardon or special protection for the family and lineage. Chanting a mantra or the name of a deity, is the essential part of the practice. Maha Mantrarchana is offering prayers to the Lord, asking him for help and protection.

Devotee: Telugu Test

Date: 30-Nov--0001

🙏సదాశివ ...

🙏సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం🙏


సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. 

       కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

శంకరుల రచనలు:

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము
       ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు.

ముగింపు:

ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు.
🌹🙏💐🌹🙏💐🌹💐🙏

Scroll To Top